మూకదాడులపై స్పందించిన కేంద్రం.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు!

  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
  • నాలుగు వారాల్లో ఓ నివేదిక సమర్పించాలని ఆదేశాలు
  • కమిటీ  సిఫారసుల పరిశీలనకు మంత్రుల బృందం
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మూకదాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మూకదాడులపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. నాలుగు వారాల్లో ఓ నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ ఇచ్చే సిఫారసుల పరిశీలనకు హోం మంత్రి నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటు చేయనున్నారు. కమిటీ సిఫారసులను మంత్రుల బృందం పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీకి సమర్పించనుంది.  
Go Back to Shorts
mob attacks
home ministry

More Telugu News